దేశంలో గత 24 గంటల్లో 48,648 మందికి కరోనా

30-10-2020 Fri 10:06
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 80,88,851
  • మృతుల సంఖ్య 1,21,090
  • కోలుకున్న వారు 73,73,375 మంది  
  • 5,94,386 మందికి ప్రస్తుతం చికిత్స 
With 48648 new COVID19 infections Indias total cases surge to 8088851

 కరోనా కేసులపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో 48,648 మందికి కరోనా నిర్ధారణ అయిందని  పేర్కొంది. అదే సమయంలో 57,386 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 80,88,851కి చేరింది.

గ‌త 24 గంట‌ల సమయంలో 563 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,21,090 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 73,73,375 మంది కోలుకున్నారు. 5,94,386 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.  
      
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 10,77,28,088 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 11,64,648 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.