Geojit financial: ఇక ఏ దేశంలోని మార్కెట్లోనైనా పెట్టుబడి పెట్టేయచ్చు.. అందుబాటులో నయా ప్లాట్‌ఫామ్!

Now lets invest globel markets through Geojit financial
  • న్యూయార్క్ సంస్థతో చేతులు కలిపిన జియోజిత్
  • చిన్న మదుపర్లు, ఐటీ వృత్తి నిపుణులకు ఉపయోగకరం
  • ఒకే ఖాతాతో ప్రపంచంలో ఎక్కడైనా పెట్టుబడి పెట్టే అవకాశం
ప్రపంచ ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టాలనుకున్న వారి కలను నెరవేర్చేందుకు ప్రముఖ బ్రోకరేజీ సంస్థ జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సరికొత్త ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. చిన్న మదుపర్లకు, అధిక సంపన్న మదుపర్లకు, ఐటీ వృత్తి నిపుణులకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది.

జియోజిత్ తీసుకొచ్చిన ప్లాట్‌ఫాం ద్వారా అమెరికా సహా ప్రపంచంలోని ఏ దేశంలోని సెక్యూరిటీల్లోనైనా ఒకటే ఖాతాతో పెట్టుబడులు పెట్టొచ్చు. ఇందుకోసం న్యూయార్క్‌కు చెందిన గ్లోబల్ వెల్త్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ ప్లాట్‌ఫాం స్టాకాల్ భాగస్వామ్యంతో చేతులు కలిపిన జియోజిత్ ఏఐ (కృత్రిమ మేధ) ఆధారిత గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేసింది.

ఈ సందర్భంగా స్టాకాల్ వ్యవస్థాపకుడు, సీఈవో సీతావ్వ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. తమ ప్లాట్‌పామ్ ద్వారా భారత్ నుంచి రోజుకు సగటున 2 మిలియన్ డాలర్ల లావాదేవీలు జరుగుతున్నట్టు చెప్పారు. అమెజాన్, యాపిల్, గూగుల్, నెట్‌ఫ్లిక్స్, ఫేస్‌బుక్, టెస్లా వంటి దిగ్గజ సాంకేతిక షేర్లతోపాటు బంగారం, వెండి, చమురు లాంటి కమొడిటీ ఈటీఎఫ్‌లలో, ట్రెజరరీ ఈటీఎఫ్‌లలో సుమారు 12 వేల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టినట్టు వివరించారు.
Geojit financial
globel markets
Investment

More Telugu News