యూరప్ లో మళ్లీ కరోనా కేసులు.. కుప్పకూలిన మన మార్కెట్లు!

28-10-2020 Wed 16:25
  • యూరప్ లో పెరుగుతున్న కరోనా కేసులు
  • 599 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 159 పాయింట్లు పతనమైన నిఫ్టీ
Stock markets ends in huge losses due to increasing Corona cases in Europe

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను మూటకట్టుకున్నాయి. యూరప్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. దీనికి తోడు అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు వేచిచూసే ధోరణితో వ్యవహరించడంతో మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.

దీంతో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 599 పాయింట్లు నష్టపోయి 39,922కి పడిపోయింది. నిఫ్టీ 159 పాయింట్లు కోల్పోయి 11,729కి చేరుకుంది. టెలికాం, కన్జ్యూమర్ గూడ్స్ సూచీలు మినహా మిగిలినవన్నీ నష్టాల్లోనే ముగిశాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
భారతి ఎయిర్ టెల్ (4.26%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.17%), మారుతి సుజుకి (0.33%), ఎల్ అండ్ టీ (0.12%).

టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.45%), ఐసీఐసీఐ బ్యాంక్ (-3.34%), టెక్ మహీంద్రా (-3.00%), బజాజ్ ఫైనాన్స్ (-2.41%), అల్ట్రాటెక్ సిమెంట్ (-2.39%).