Allu Arjun: విశాఖలో 'పుష్ప' షూటింగు.. రెడీ అవుతున్న బన్నీ

Allu Arjun to shoot in Vizag for Pushpa movie
  • సుకుమార్ దర్శకత్వంలో బన్నీ 'పుష్ప'
  • లాక్ డౌన్ తో ఏడు నెలలుగా ఆగిన షూట్
  • నవంబర్ తొలి వారం నుంచి విశాఖలో
  • అనంతరం మారేడుమిల్లి అడవుల్లో షూట్  
అల్లు అర్జున్ తాజా చిత్రం 'పుష్ప'. 'అల వైకుంఠ పురములో' విజయం తర్వాత బన్నీ చేస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకుడు. అటవీ నేపథ్యంలో ఎర్రచందనం స్మగ్లింగ్ ఇతివృత్తంతో రూపొందే ఈ చిత్రం షూటింగుకి లాక్ డౌన్ దెబ్బ తగిలి గత ఏడు నెలలుగా ఆగిపోయింది. ఇప్పుడిక మెల్లగా షూటింగులు మొదలవుతుండడంతో ఈ సినిమా షూటింగును కూడా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

మొదట్లో కేరళ అడవుల్లో షూటింగ్ చేద్దామని ప్లాన్ చేసినప్పటికీ ఇప్పుడు ఆ ఆలోచనను యూనిట్ విరమించుకున్నట్టు తెలుస్తోంది. నవంబర్ మొదటి వారం నుంచి ప్రారంభించే తాజా షెడ్యూలును మొదట వారం రోజుల పాటు విశాఖపట్నంలో నిర్వహిస్తారట. ఇందులో హీరో బన్నీ కూడా జాయిన్ అవుతాడని అంటున్నారు. ఆ తర్వాత తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అడవులకు షిఫ్టయి, అక్కడ భారీ షెడ్యూలును జరుపుతారని తెలుస్తోంది.

ఇందులో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కొత్త అవతారంలో కనిపిస్తాడు. చిత్తూరు యాసను మాట్లాడుతూ కాస్త రఫ్ గా కూడా ఉంటాడు. అతని సరసన రష్మిక కథానాయికగా నటించనుంది.
Allu Arjun
Rashmika Mandanna
Sukumar

More Telugu News