ఆ విషయంలో కేసీఆర్, హరీశ్‌రావుకు డాక్టరేట్లు ఇవ్వొచ్చు: డీకే అరుణ

28-10-2020 Wed 07:35
  • అబద్ధాలు చెప్పడంలో వారిద్దరూ దిట్ట
  • దుబ్బాక ప్రజలు టీఆర్ఎస్‌ను ఓడించాలని నిర్ణయించుకున్నారు
  • ఓటమి భయంతోనే దాడులు
DK Aruna slams Telangana CM KCR and Minister Harish Rao

దుబ్బాక ప్రజలు టీఆర్ఎస్‌ను ఓడించాలని నిర్ణయించుకున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. నిరసన దీక్ష చేపట్టిన పార్టీ చీఫ్ బండి సంజయ్‌ను నిన్న పరామర్శించిన ఆమె మాట్లాడుతూ.. దుబ్బాకలో బీజేపీ గెలుపు ఖాయమని తేలిపోవడంతోనే ఇలాంటి దుశ్చర్యలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 ఓటమి భయంతోనే అలజడి సృష్టిస్తున్నారని, తమకు ఓటు వేయకుంటే సంక్షేమ పథకాలు ఇవ్వబోమని బెదిరిస్తున్నారని ఆరోపించారు. కేంద్రంపై ఆరోపణలు చేయడం తప్ప టీఆర్ఎస్ చేసిందేమీ లేదన్నారు. అబద్ధాలు చెప్పడంలో దిట్టలైన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులకు డాక్టరేట్లు ఇవ్వొచ్చని అరుణ ఎద్దేవా చేశారు.