ఐపీఎల్ 2020: టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్... సన్ రైజర్స్ కు బ్యాటింగ్

27-10-2020 Tue 19:27
  • ఐపీఎల్ లో నేడు సన్ రైజర్స్ వర్సెస్ ఢిల్లీ
  • దుబాయ్ వేదికగా మ్యాచ్
  • సన్ రైజర్స్ జట్టులో మూడు మార్పులు
Delhi Capitals won the toss against Sunrisers Hyderabad

ఐపీఎల్ లో నేడు సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఈ పోరుకు వేదికగా నిలుస్తోంది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దాంతో సన్ రైజర్స్ మొదట బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ కోసం సన్ రైజర్స్ జట్టులో మూడు మార్పులు చేశారు. జానీ బెయిర్ స్టో, ప్రియమ్ గార్గ్, ఖలీల్ అహ్మద్ లను తప్పించారు. వారి స్థానంలో కేన్ విలియమ్సన్, వృద్ధిమాన్ సాహా, షాబాజ్ నదీమ్ జట్టులోకి వచ్చారు.

అటు, విజయాల బాటలో పయనిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఎలాంటి మార్పులు లేవని కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ తెలిపాడు. పాయింట్ల పట్టికలో రెండోస్థానంలో ఉన్న ఢిల్లీ జట్టు ప్లే ఆఫ్ అవకాశాలను దాదాపు ఖాయం చేసుకోగా, ఏడోస్థానంలో ఉన్న సన్ రైజర్స్ అవకాశాలు మిణుకుమిణుకుమంటున్నాయి.