Chandrababu: సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా అన్నదాతకు బేడీలా?: చంద్రబాబు

Chandrababu comments on Amaravati farmers issue
  • కృష్ణాయపాలెం రైతుల చేతులకు బేడీలు 
  • ఇది మానవ హక్కుల ఉల్లంఘనే అన్న చంద్రబాబు
  • సీఎం బాధ్యత వహించాలని వ్యాఖ్యలు
రాజధాని ప్రాంతంలోని కృష్ణాయపాలెంకు చెందిన ఎనిమిది మంది రైతుల చేతులకు బేడీలు వేసి గుంటూరు జిల్లా జైలుకు తరలించడంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా అన్నదాతకు బేడీలా? అంటూ ఆయన మండిపడ్డారు. ఇది కచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘన అని, దీనికి సీఎం బాధ్యత వహించాలని అన్నారు. మేజిస్ట్రేట్ అనుమతి లేకుండా రైతులకు బేడీలు వేయకూడదని స్పష్టం చేశారు. కృష్ణాయపాలెం రైతులపై అట్రాసిటీ కేసులు పెట్టడం సరికాదని అన్నారు.
Chandrababu
Farmers
Arrest
Amaravati
AP Capital
Andhra Pradesh

More Telugu News