రెవెన్యూ ఉద్యోగులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అయ్యన్న క్షమాపణ చెప్పాలి: ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ చీఫ్ బొప్పరాజు డిమాండ్
- అయ్యన్న వ్యాఖ్యలు ఖండిస్తున్నామన్న బొప్పరాజు
- అయ్యన్న తన వ్యాఖ్యలు వెనక్కితీసుకోవాలని స్పష్టీకరణ
- మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలా మాట్లాడడం తగదని హితవు
గతంలో మంత్రిగా పనిచేసి, సీనియర్ రాజకీయవేత్త అయివుండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని బొప్పరాజు హితవు పలికారు. ఆక్రమణలకు పాల్పడినవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోండి అని చెప్పాల్సిన మీరే, చట్టపరంగా విధి నిర్వహణలో పాల్గొన్న రెవెన్యూ అధికారులపై దుర్భాషలాడడం మంచిపద్ధతికాదని స్పష్టం చేశారు. అధికారులను అభినందించాల్సింది పోయి, ఇష్టంవచ్చినట్టు మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు.