నితీశ్ కుమార్ కు షాక్.. చెప్పులు విసిరిన నిరసనకారులు

27-10-2020 Tue 13:49
  • ముజఫర్ పూర్ లో నితీశ్ కు చేదు అనుభవం
  • హెలికాప్టర్ వద్దకు వెళ్తుండగా ఘటన
  • నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Protesters throws chappals on to Nitish Kumar

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నాయకులకు ఊహించని పరాభవాలు ఎదురవుతున్నాయి. మొన్న ఆర్జేడీ నేత, మహాకూటమి సీఎం అభ్యర్థి తేజశ్వి యాదవ్ పై గుర్తు తెలియని వ్యక్తి చెప్పు విసిరాడు. ఈ రోజు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు అదే చేదు అనుభవం ఎదురైంది.

ముజఫర్ పూర్ లో ఎన్నికల ర్యాలీని ముగించుకుని హెలికాప్టర్ వద్దకు వస్తుండగా కొందరు చెప్పులు విసిరారు. అయితే అవి ఆయనకు తగలలేదు. ఈ ఘటనలో నలుగురు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ ఎన్నికల్లో నితీశ్ కు అసహనం ఎక్కువవుతోంది. ఆయన సభలలో వ్యతిరేక నినాదాలు వినిపిస్తున్నాయి. దీంతో, నిరసనకారులపై నితీశ్ మండిపడుతున్నారు. ఓ సభలో ఆయన మాట్లాడుతూ, ఓట్లు వేయకున్నా పర్వేదంటూ నిరసనకారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు సంచలనం రేపాయి.

మరోవైపు మొత్తం మూడు విడతల్లో బీహార్ ఎన్నికలు జరగబోతున్నాయి. అక్టోబర్ 28, నవంబర్ 3, నవంబర్ 7 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 10న ఫలితాలు వెలువడతాయి.