Botsa Satyanarayana: పైడితల్లి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న మంత్రి బొత్స

AP Minister Botsa Sathyanarayana visits Paidithalli temple along with family members
  • విజయనగరంలో పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాలు
  • బొత్సకు పూర్ణకుంభ స్వాగతం పలికిన ఆలయ వర్గాలు
  • అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన బొత్స
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇవాళ విజయనగరం పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. సిరిమానోత్సవం నేపథ్యంలో ఈ ఉదయం కుటుంబ సమేతంగా ఆలయానికి వెళ్లిన మంత్రి బొత్సకు ఆలయ వర్గాలు పూర్ణకుంభ స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా ఆయన పైడితల్లి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలో పూజలు నిర్వహించారు.

అనంతరం బొత్స మాట్లాడుతూ, సకాలంలో వానలు కురిసి రైతుల జీవితాల్లో సుఖశాంతులు నిండాలని కోరుకున్నట్టు వెల్లడించారు. అందరి ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ పూజలు చేసినట్టు తెలిపారు. పైడితల్లి అమ్మవారి వేడుకలను ప్రతి ఏటా నిర్వహించినట్టే సంప్రదాయాలను అనుసరించి నిర్వహిస్తున్నామని చెప్పారు. అటు, ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా పైడితల్లి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.
Botsa Satyanarayana
Paidithalli Temple
Sirimanotsavam
Vijayanagaram
YSRCP
Andhra Pradesh

More Telugu News