మోహన్ భగవత్ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందన

25-10-2020 Sun 17:49
  • మన భూమిని ఆక్రమించేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొడుతున్నామన్న భగవత్
  • అసలు నిజం ఏమిటో ఆయనకు తెలుసన్న రాహుల్
  • భారత భూమిని చైనా ఆక్రమించిందని  వ్యాఖ్య
Mohan Bhagawat knows the truth says Rahul Gandhi

విజయదశమి సందర్భంగా ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ మాట్లాడుతూ, చైనా సామ్రాజ్యవాద దేశమని విమర్శించారు. చైనా దూకుడును తగ్గించేందుకు ఆ దేశానికి వ్యతిరేకంగా పొరుగు దేశాలైన నేపాల్, శ్రీలంకలతో కూటమిని ఏర్పాటు చేసుకోవాలని భారత ప్రభుత్వానికి సూచించారు. మన సైన్యం సాహసోపేతంగా వ్యవహరిస్తోందని... మన భూభాగాన్ని చైనా ఆక్రమించేందుకు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొడుతోందని వ్యాఖ్యానించారు.

మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు. అసలు నిజం ఏమిటో మోహన్ భగవత్ కు తెలుసని ఆయన అన్నారు. భారత భూభాగాన్ని చైనా అక్రమంగా ఆక్రమించుకున్న సంగతి భగవత్ కు తెలుసని చెప్పారు.