Narendra Modi: చైనా, పాకిస్థాన్ తో యుద్ధం ఎప్పుడు చేయాలనేది మోదీ డిసైడ్ చేశారు: యూపీ బీజేపీ చీఫ్

PM Has Decided When There Will Be War With China and Pak says UP BJP Chief
  • అర్టికల్ 370 రద్దు, రామ మందిరం మాదిరే యుద్ధంపై కూడా నిర్ణయం తీసుకున్నారన్న స్వతంత్ర దేవ్
  • వీడియో క్లిప్పింగ్ ను పోస్ట్ చేసిన ఎమ్మెల్యే
  • చర్చనీయాంశంగా మారిన వ్యాఖ్యలు
సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా, పాకిస్థాన్ దేశాలతో యుద్ధం ఎప్పుడు చేయాలనే విషయాన్ని ప్రధాని మోదీ నిర్ణయించారని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు, అయోధ్య రామ మందిర నిర్మాణం వంటి కీలక అంశాల్లో నిర్ణయం తీసుకున్నట్టే యుద్ధంపై కూడా మోదీ ఒక నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.

బీజేపీ ఎమ్మెల్యే సంజయ్ యాదవ్ నివాసంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా స్వతంత్ర దేవ్ అక్కడున్న వారితో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్ ను సంజయ్ యాదవ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ అంశం దేశ వ్యాప్తంగా చర్చనీయాశమైంది.
Narendra Modi
China
Pakistan
War

More Telugu News