బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

25-10-2020 Sun 09:39
  • బీజేపీ రాష్ట్ర కార్యాలయ ప్రారంభానికి విజయవాడకు
  • ఈ ఉదయం అమ్మవారిని దర్శించుకుని పూజలు
  • ప్రసాదం పథకం కింద రూ. 85 కోట్లు మంజూరు చేయాలని ఈవో వినతి
Union minister kishan reddy visits Goddess vijayawada kanaka durga

విజయవాడలో బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించేందుకు వచ్చిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఈ ఉదయం బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి పోయి ప్రజలందరూ సుఖసంతోషాలతో చల్లగా ఉండేలా దీవించమని అమ్మవారిని కోరుకున్నట్టు చెప్పారు.

ఈ సందర్భంగా మంత్రికి వినతిపత్రం సమర్పించిన ఆలయ ఈవో సురేశ్ బాబు ప్రసాదం పథకం కింద రూ. 85 కోట్లు మంజూరు చేయాలని కోరారు. మంత్రి వెంట ఎంపీ జీవీఎల్, ఎమ్మెల్సీ మాధవ్, విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.