తిరుమలలో సందడి చేసిన శర్వానంద్, రష్మిక!

25-10-2020 Sun 09:10
  • ప్రస్తుతం 'ఆడవాళ్లూ మీకు జోహార్లు' చిత్రంలో నటిస్తున్న జంట
  • సినిమా విజయవంతం కావడానికి స్వామి దర్శనం
  • తీర్థ ప్రసాదాలు అందించిన అర్చకులు
Rashmika and Sharvanand in Tirumala

ఈ ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వరుడిని హీరో శర్వానంద్, హీరోయిన్ రష్మికా మందన్నా దర్శించుకున్నారు. వీఐపీ దర్శన సమయంలో వచ్చిన వీరికి ఆలయ అధికారులు దర్శనం చేయించారు. ఆపై ఆలయ అర్చకులు వారిని ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందించారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి  'ఆడవాళ్లూ మీకు జోహార్లు' అనే చిత్రంలో నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా విజయవంతం కావాలని స్వామివారిని కోరేందుకు తాము వచ్చామని దర్శనం అనంతరం ఆలయం వెలుపల వారు మీడియాకు వివరించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ఫ్యాన్స్ కు దసరా శుభాకాంక్షలు తెలిపిన ఈ జంట, త్వరలోనే తమ కొత్త సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేస్తామని అన్నారు.