Chandrababu: దళిత రైతు గాలి జైపాల్ పట్ల పోలీసు వేధింపులను ఖండిస్తున్నాం: చంద్రబాబు

Chandrababu condemns police action on dalit farmer
  • నెల్లూరు జిల్లాలో దళిత రైతుపై పోలీసుల దాడి
  • చొక్కా పట్టుకుని ఈడ్చుకెళ్లే అధికారం ఎవరిచ్చారన్న చంద్రబాబు
  • నిజాయతీగా వ్యవహరించిన రైతుకు ఇచ్చే బహుమానం ఇదేనా?
అమాయక దళిత రైతు జైపాల్ పట్ల అమానుషంగా ప్రవర్తించిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లి దళిత రైతు గాలి జైపాల్ పట్ల పోలీసు వేధింపులను ఖండిస్తున్నామని చెప్పారు.

'ధాన్యం కొనడంలో విఫలమవడం రాష్ట్ర ప్రభుత్వం తరపున మొదటి తప్పు.  జైపాల్‌ కు ఉన్నది 3 ఎకరాలైతే, 18 ఎకరాలు లీజుకు తీసుకుని 50 పుట్ల ధాన్యం అమ్మినట్లుగా పౌరసరఫరాల వెబ్‌సైట్‌లో ఎలా నమోదైంది? దీనిపై చర్యలు తీసుకోవాలని నిజాయితీగా కోరిన దళిత రైతుకు ఇచ్చే బహుమానం వేధింపులా? జైపాల్ ను చొక్కా పట్టుకుని ఈడ్చుకెళ్లి జీపులో పడేసే అధికారం మీకెవరిచ్చారు? నెల్లూరు దళిత రైతు జైపాల్ పట్ల వైసీపీ ప్రభుత్వ దుశ్చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. అమాయక దళిత రైతును క్షోభకు గురిచేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాను' అని చంద్రబాబు ట్విట్టర్ ద్వారా వ్యాఖ్యానించారు.
Chandrababu
Telugudesam
Dalit Farmer
YSRCP

More Telugu News