15 ఏళ్లుగా కోమాలో ఉన్న సౌదీ యువరాజు తొలిసారి చేయి కదిలించాడు!

23-10-2020 Fri 22:02
  • 2005లో సౌదీ యువరాజుకు యాక్సిడెంట్
  • కారు ప్రమాదంలో గాయపడి కోమాలోకి వెళ్లిన ప్రిన్స్
  • ఓ మహిళ పిలుపుకు స్పందించిన వైనం
Saudi prince lifts his hand since he has been in coma

సౌదీ అరేబియా యువరాజు అల్ వలీద్ బిన్ ఖాలిద్ అల్ సాద్ 2005లో కారు యాక్సిడెంట్ కు గురయ్యారు. అప్పటినుంచి ఆయన కోమాలోనే ఉన్నారు. 2015లో ఆయన శరీరంలో కొద్దిగా కదలికలు కనిపించాయి. అయితే సౌదీ యువరాజు ఆరోగ్య పరిస్థితిలో గణనీయమైన మార్పు అనదగ్గ సంఘటన తాజాగా జరిగింది. ఆయన తన చేతిని బాగా కదిలించారు. తన చేతిని పైకి లేపగలిగారు.

ప్రస్తుతం అల్ వలీద్ వయసు 47 సంవత్సరాలు. ఆయన కారు ప్రమాదానికి గురైన సమయంలో మిలిటరీ కాలేజిలో విద్యాభ్యాసం చేస్తున్నారు. యాక్సిడెంట్ కారణంగా ఆయన మెదడులో రక్తస్రావం జరిగింది. అప్పటినుంచి ఇప్పటివరకు కోమాలోనే ఉన్నారు. తాజాగా చేతిని కదిలించడంతో సౌదీ రాజకుటుంబంలో సంతోషం వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట సందడి చేస్తోంది.

సౌదీ యువరాణి నౌరా బిన్ తలాల్ అల్ సాద్... మరికొందరు యువరాజును పలకరించే ప్రయత్నం చేయగా, ఆయన చేతిని పైకి లేపారు. మరోసారి, మరోసారి, ఇంకొంచెం పైకి ఎత్తు అంటూ ఆ మహిళ చెబుతుండగా, ఆయన తన చేతిని మరికాస్త ఎత్తే ప్రయత్నం చేశారు.