కాజల్ నటిస్తున్న తొలి వెబ్ సీరీస్.. ఫస్ట్ లుక్ విడుదల!

23-10-2020 Fri 21:03
  • వెబ్ సీరీస్ వైపు స్టార్ హీరోయిన్ల చూపు 
  • కాజల్ ప్రధానపాత్రలో 'లైవ్ టెలికాస్ట్'
  • వెంకట్ ప్రభు దర్శకత్వంలో నిర్మాణం
  • త్వరలో 'డిస్నీ హాట్ స్టార్'లో స్ట్రీమింగ్    
Kajal starring first web series first look out

ఇటీవలి కాలంలో ఓటీటీ ప్లాట్ ఫామ్ కి క్రేజ్ బాగా పెరిగింది. థియేటర్ కి ఇది ప్రత్యామ్నాయంగా ఎదుగుతుండడంతో తారలు కూడా ఇటువైపు దృష్టి సారిస్తున్నారు. దానికి తోడు పారితోషికం పరంగా కూడా ఆకర్షణీయంగా ఉండడంతో ముఖ్యంగా పలువురు స్టార్ హీరోయిన్లు వెబ్ సీరీస్ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పటికే పలువురు హీరోయిన్లు వెబ్ సీరీస్ కి కమిట్ అయ్యారు కూడా.

ఈ క్రమంలో టాలీవుడ్ అగ్ర కథానాయిక కాజల్ అగర్వాల్ కూడా తొలిసారిగా ఓ వెబ్ సీరీస్ లో నటించింది. ప్రముఖ తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ వెబ్ సీరీస్ పేరు 'లైవ్ టెలికాస్ట్'. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను దర్శకుడు వెంకట్ ప్రభు ఈ రోజు విడుదల చేశారు.

ఫస్ట్ లుక్ చూస్తుంటే ఇది హారర్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న సీరీస్ అన్న విషయం మనకు ఇట్టే అర్థమవుతుంది. మొత్తం ఏడు ఎపిసోడ్లుగా ఇది రూపొందుతోంది. ఇందులో కాజల్ తో పాటు వైభవ్, ఆనంది ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. త్వరలో 'డిస్నీ ప్లస్ హాట్ స్టార్'లో తొలి ఎపిసోడ్ స్ట్రీమింగ్ కి రానుంది.