ఐపీఎల్ లో నేడు ముంబయి వర్సెస్ చెన్నై... రోహిత్ శర్మ స్థానంలో టాస్ కు వచ్చిన పొలార్డ్

23-10-2020 Fri 19:26
  • గాయంతో ఈ మ్యాచ్ కు దూరమైన రోహిత్ శర్మ
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి ఇండియన్స్
  • రోహిత్ స్థానంలో సౌరభ్ తివారీకి ముంబయి జట్టులో చోటు
  • జాదవ్, వాట్సన్, చావ్లాలను పక్కనబెట్టిన చెన్నై
Mumbai Indians won the toss and elected bowling against Chennai Super Kings

ఐపీఎల్ లో నేడు ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. టోర్నీ ఆరంభ మ్యాచ్ లో తలపడిన ఈ రెండు జట్లు మరోసారి అమీతుమీకి సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్ కు ముంబయి రెగ్యులర్ సారథి రోహిత్ శర్మ కండరాల గాయంతో దూరమయ్యాడు. రోహిత్ శర్మ స్థానంలో సీనియర్ బ్యాట్స్ మన్ కీరన్ పొలార్డ్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబయి తాత్కాలిక కెప్టెన్ పొలార్డ్ బౌలింగ్ ఎంచుకున్నాడు.

ఇక జట్ల విషయానికొస్తే... చెన్నై జట్టులో మూడు మార్పులు చేశారు. కేదార్ జాదవ్, షేన్ వాట్సన్, పియూష్ చావ్లా స్థానంలో జగదీశన్, రుతురాజ్ గైక్వాడ్, ఇమ్రాన్ తాహిర్ జట్టులోకి వచ్చారు. ముంబయి జట్టులో రోహిత్ శర్మ స్థానంలో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మన్ సౌరభ్ తివారీని తీసుకున్నారు.