Mahesh Babu: ప్రభాస్ కు బర్త్ డే విషెస్ తెలిపిన సినీ, రాజకీయ ప్రముఖులు

Superstar Mahesh Babu wishes birthday boy Prabhas
  • నేడు ప్రభాస్ పుట్టినరోజు
  • వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు
  • సోషల్ మీడియాలో ప్రభాస్ నామస్మరణ
టాలీవుడ్ అగ్రహీరో ప్రభాస్ ఇవాళ 42వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ప్రభాస్ మేనియా కనిపిస్తోంది. ఈ క్రమంలో ఆయనపై జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా ప్రభాస్ కు బర్త్ డే విషెస్ తెలియజేశారు. జీవితంలో ఎన్నో విజయాలు సాధించాలని, సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటున్నట్టు మహేశ్ బాబు ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. అంతేకాదు, ప్రభాస్ తో కలిసి దిగిన ఓ ఫొటోను కూడా పంచుకున్నారు.

ప్రభాస్ కు సీనియర్ హీరో వెంకటేశ్ కూడా విషెస్ తెలిపారు. 'హ్యాపీ బర్త్ డే ప్రభాస్. అందుకో నా నుంచి ప్రేమాభిమానాలు' అంటూ ట్వీట్ చేశారు.

'ప్రభాస్ అన్నా.. వెరీ హ్యాపీ బర్త్ డే. ఈ ఏడాది నీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను' అంటూ వరుణ్ తేజ్ శుభాకాంక్షలు తెలిపారు.

ఇక ఐపీఎల్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా డార్లింగ్ ప్రభాస్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా కెప్టెన్ డేవిడ్ వార్నర్ చేసిన టిక్ టాక్ వీడియోను పంచుకుంది. ఆ వీడియోలో వార్నర్ బాహుబలి డైలాగును పలకడం చూడొచ్చు.

ఇంకా, నితిన్, రాశీ ఖన్నా, రకుల్ ప్రీత్ సింగ్, తమన్, దేవి శ్రీప్రసాద్, సాయితేజ్ వంటి ప్రముఖులు కూడా ప్రభాస్ కు శుభాకాంక్షలు తెలిపారు. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అయితే అటు కృష్ణంరాజు, ఇటు ప్రభాస్.. మధ్యలో తాను నిలబడి ఉన్న ఫొటోను పంచుకున్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కూడా ప్రభాస్ కు విషెస్ తెలియజేశారు.
Mahesh Babu
Prabhas
Birthday
Wishes
Tollywood

More Telugu News