సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

23-10-2020 Fri 07:25
  • వరుస షూటింగుల్లో పాల్గొంటున్న లావణ్య 
  • హైదరాబాదులో షూటింగు చేస్తున్న విశాల్
  • కాజల్ పెళ్లికి వెళుతున్న టాలీవుడ్ హీరో
Lavanya tripathi joins back to back shoots

*  కథానాయిక లావణ్య త్రిపాఠి వరుసగా షూటింగుల్లో పాల్గొంటోంది. ఇటీవలే 'ఏ 1 ఎక్స్ ప్రెస్' చిత్రం షూటింగును పూర్తిచేసిన లావణ్య.. తాజాగా 'చావు కబురు చల్లగా' చిత్రం షూటింగులో జాయిన్ అయింది. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కార్తికేయ కథానాయకుడు.
*  విశాల్, ఆర్య కలసి ఓ సినిమాలో నటిస్తున్నారు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ గత రెండు రోజులుగా హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఇప్పటికే విశాల్ షూటింగులో పాల్గొంటుండగా, ఆర్య త్వరలో జాయిన్ అవుతాడు.
*  అందాల కథానాయిక కాజల్ అగర్వాల్ ఈ నెల 30న వివాహం చేసుకుంటున్న సంగతి విదితమే. ముంబైలోని ఆమె స్వగృహంలో జరిగే ఈ వేడుకకు పరిమిత సంఖ్యలో అతిథులను ఆహ్వానిస్తున్నారు. వారిలో టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కూడా వున్నాడు. కాజల్ తనకు మంచి స్నేహితురాలనీ, ఆమె పెళ్లికి తాను వెళుతున్నానని శ్రీనివాస్ చెప్పాడు.