ఉగ్రవాదులతో పోరు.. అమరుడైన శ్రీకాకుళం జిల్లా జవాను బాబూరావు
- అరుణాచల్ ప్రదేశ్‌లోని ఖోన్సా సరిహద్దు సమీపంలో ఎదురు కాల్పులు
- ఈ ఏడాది ఫిబ్రవరిలోనే వివాహం
- మూడు రోజుల క్రితమే విధుల్లో చేరిన బాబూరావు
నేటి ఉదయం సైనిక లాంఛనాలతో బాబూరావు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. బాబూరావుకు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే వివాహం కాగా, గత నెల చివరిలో విధుల్లో చేరేందుకు వెళ్లాడు. అక్కడ 21 రోజుల క్వారంటైన్ అనంతరం మూడు రోజుల క్రితమే విధుల్లో చేరాడు. అంతలోనే ఆయన అమరుడైన వార్త తెలిసి గ్రామంలో విషాదం నెలకొంది.