Dr Reddys Labs: డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ పై సైబర్ దాడి... స్తంభించిన కార్యకలాపాలు

  • ఐదు దేశాల్లో కార్యకలాపాల నిలిపివేత
  • నష్టనివారణ కోసం డేటా సెంటర్ సేవలను వేరు చేసిన రెడ్డీస్
  • సైబర్ దాడిపై పోలీసులకు ఫిర్యాదు
Cyber attack on Dr Reddys Labs

ఫార్మా రంగ దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ సైబర్ దాడులకు గురైంది. ఈ సైబర్ దాడితో రెడ్డీస్ ల్యాబ్స్ కు భారీ నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. తాజా సైబర్ దాడి అనంతరం భారత్, అమెరికా, రష్యా, బ్రిటన్, బ్రెజిల్ దేశాల్లో రెడ్డీస్ ల్యాబ్స్ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ఆయా దేశాల్లో ఉత్పత్తిని నిలిపివేసినట్టు సంస్థ వెల్లడించింది. 24 గంటల తర్వాత కార్యకలాపాలు పునఃప్రారంభం అవుతాయని సంస్థ వర్గాలు తెలిపాయి.

సైబర్ దాడి నేపథ్యంలో ఇతర విభాగాలు దీని ప్రభావానికి గురికాకుండా తమ డేటా సెంటర్ సేవలను వేరు చేసినట్టు సంస్థ వెల్లడించింది. ఈ సైబర్ దాడిపై డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తమ సంస్థపై సైబర్ దాడి జరిగిన విషయమై డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ వర్గాలు స్టాక్ ఎక్చేంజ్ కు సమాచారం అందించాయి.

More Telugu News