ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ ను ఉచితంగా ఇస్తాం: పళనిస్వామి

22-10-2020 Thu 17:30
  • బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఫ్రీ వ్యాక్సిన్ ప్రకటించిన బీజేపీ
  • బీజేపీ దారిలోనే పళనిస్వామి అడుగులు
  • వ్యాక్సిన్ రెడీ కాగానే ఉచితంగా ఇస్తామని ప్రకటన
CM Palaniswami declares free Corona vaccine to all

రాష్ట్ర ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ ను ఉచితంగా ఇస్తామంటూ బీహార్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా తమిళనాడు ప్రభుత్వం కూడా ఇదే తరహా ప్రకటన చేసింది. త్వరలోనే తమిళనాడు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి మాట్లాడుతూ, కరోనాకు వ్యాక్సిన్ రెడీ అయిన వెంటనే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ఈ వ్యాక్సిన్ ను ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. మరోవైపు బీజేపీ ప్రకటనపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీహార్ కు మాత్రమే ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తే... మిగతా రాష్ట్రాల సంగతి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.