Adimulapu Suresh: ఈ విద్యా సంవత్సరం వృథా కాదు... అన్ని చర్యలు తీసుకుంటున్నాం: ఆదిమూలపు సురేశ్

  • నవంబరు 2 నుంచి ఏపీలో తెరుచుకోనున్న పాఠశాలలు
  • సిలబస్, సెలవులు తగ్గిస్తామన్న మంత్రి
  • ప్రతి స్కూల్లో వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని వెల్లడి
AP Minister Adimulapu Suresh confidant about the education year

నవంబరు 2న పాఠశాలల పునఃప్రారంభానికి ఏపీ సర్కారు సమాయత్తమవుతోంది. దీనిపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వివరాలు తెలిపారు. ఈ విద్యా సంవత్సరం ఎట్టిపరిస్థితుల్లోనూ వృథా కాదని, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన పనిలేదని స్పష్టం చేశారు.

 నవంబరు 2 నుంచి అన్ని జాగ్రత్తలతో పాఠశాలలు నడుస్తాయని, అందుకు అనుగుణంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ప్రతి పాఠశాలకు వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచుతామని, విద్యార్థులకు ప్రత్యేకంగా కరోనా క్లాసు ఉంటుందని తెలిపారు.

ఇప్పటికే అనేక నెలలు గడిచిపోయినందున ఈ విద్యాసంవత్సరాన్ని కుదిస్తున్నామని, అందువల్ల సిలబస్ తగ్గించాల్సి వస్తోందని వెల్లడించారు. సిలబస్ పూర్తి చేసేందుకు వీలుగా సెలవులు కూడా తగ్గిస్తామని మంత్రి వివరించారు. 1, 3, 5, 7, 9 తరతులకు ఒకరోజు, 2, 4, 6, 8, 10 తరగతులకు మరో రోజు క్లాసులు నిర్వహిస్తారని తెలిపారు.

More Telugu News