Parineeti Chopra: ఆయనను తప్ప మరెవరినీ ఇష్టపడలేను: పరిణీతి చోప్రా

I like Saif Ali Khan says Parineeti Chopra
  • సైఫ్ అలీ ఖాన్ అంటే నాకు చాలా ఇష్టం
  • ఈ విషయం ఆయన భార్యకు కూడా చెప్పాను
  • 'జబారియో' సినిమా ప్రమోషన్ లో పరిణీతి సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఇప్పటికీ మగువల మనసులను దోస్తూనే ఉన్నాడు. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్నా సైఫ్ కున్న క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. తాజాగా అతని మీద తనకు ఎంత ప్రేమ ఉందో బాలీవుడ్ అమ్మడు పరిణీతి చోప్రా తెలిపింది.

సైఫ్ ను తాను చాలా ప్రేమిస్తున్నానని చెప్పింది. సైఫ్ ను తప్ప మరెవరినీ ఇష్టపడలేనని తెలిపింది. ఈ విషయాన్ని ఆయన భార్యకు కూడా చెప్పానని అంది. పరిణీతి నటించిన తాజా చిత్రం 'జబారియో'. విడుదలకు సిద్ధంగా వున్న ఈ సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రాకు జోడీగా ఆమె నటించింది. ఈ చిత్రం ప్రమోషన్ కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పరిణీతి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసింది. పరిణీతి వ్యాఖ్యలపై సైఫ్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.
Parineeti Chopra
Saif Ali Khan
Bollywood

More Telugu News