ఆయన పార్టీని వీడటం వెనుక పెద్ద విషాదమే వుంటుంది: సంజయ్ రౌత్

22-10-2020 Thu 12:19
  • బీజేపీని వీడిన ఏక్ నాథ్ ఖడ్సే
  • ఖడ్సే కళ్లలో నీళ్లు నిండిపోయాయన్న సంజయ్ రౌత్
  • ఎన్సీపీలో చేరాలనుకోవడం వెనుక పెద్ద కారణమే ఉంటుందని వ్యాఖ్య
Sanjay Rauts response on Eknath Khadses joining in NCP

మహారాష్ట్ర సీనియర్ రాజకీయ నాయకుడు ఏక్ నాథ్ ఖడ్సే బీజేపీకి గుడ్ బై చెప్పారు. రేపు ఆయన ఎన్సీపీలో చేరనున్నారు. ఈ సందర్భంగా శివసేన కీలక నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ... 40 ఏళ్ల పాటు బీజేపీకి సేవ చేసిన వ్యక్తి ఆ పార్టీని వీడాలనుకున్నారనంటే... దీని వెనుక పెద్ద విషాదమే ఉంటుందని చెప్పారు. ఆయన జీవితంలో ఇదొక పెద్ద మలుపని అన్నారు. తన నిర్ణయాన్ని ఖడ్సే ప్రకటిస్తున్నప్పుడు ఆయన కళ్లు నీళ్లతో నిండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీని వీడి ఎన్సీపీలో చేరాలని ఆయన నిర్ణయించుకోవడం వెనుక పెద్ద కారణమే ఉంటుందని చెప్పారు.

మరోవైపు పార్టీని వీడుతున్నట్టు ప్రకటించే సమయంలో మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవిస్ పై ఖడ్సే తీవ్ర ఆరోపణలు చేశారు. అత్యాచారం కేసులో తనను ఇరికించేందుకు ఫడ్నవిస్ కుట్ర పన్నారని మండిపడ్డారు. బీజేపీని వీడటం బాధాకరమే అయినప్పటికీ తప్పడం లేదని చెప్పారు. తాను పార్టీని వీడటానికి కారణం ఫడ్నవిసే అని తెలిపారు.