RRR: పులిలా దూసుకెళ్తున్న జూనియర్ ఎన్టీఆర్.. ‘ఆర్ఆర్ఆర్’ నుంచి కొమురం భీమ్ టీజర్ విడుదల

Ramaraju For Bheem Bheem Intro RRR Telugu
  • అరగంట ఆలస్యంగా విడుదల చేయించిన రాజమౌళి
  • చెర్రీ వాయిస్ తో ఉన్న ఆర్ఆర్ఆర్ ఎన్టీఆర్ భీమ్ టీజర్
  • పులిలా పోరాటానికి దూసుకెళ్తున్న ఎన్టీఆర్
'బాహుబలి' సినిమా తర్వాత దర్శకుడు రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమాలో కొమరం భీమ్‌గా నటిస్తోన్న ఎన్టీఆర్‌కు సంబంధించిన టీజర్ ను ఆ సినిమా యూనిట్ ఈ రోజు విడుదల చేసింది.  దీని కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తోన్న విషయం తెలిసిందే. 11 గంటలకు ఈ టీజర్ ను విడుదల చేస్తామని చెప్పినప్పటికీ, అరగంట ఆలస్యంగా దీన్ని విడుదల చేశారు.
            
ఇప్పటికే ఈ సినిమా నుంచి  ‘భీమ్‌ ఫర్‌ రామరాజు’ టీజర్ విడుదలైన విషయం తెలిసిందే. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్‌ను ఈ సినిమా యూనిట్ ఇంతకుముందే ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఈ రోజు కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ ను పరిచయం చేసింది.

‘వాడు కనపడితే సముద్రాలు తడబడతాయి’.. అంటూ చెర్రీ వాయిస్ తో ఉన్న ఆర్ఆర్ఆర్ ఎన్టీఆర్ భీమ్ టీజర్ అదుర్స్ అనిపిస్తోంది. ‘నా తమ్ముడు గోండు బెబ్బులి కొమురం భీం’ అంటూ చరణ్ ఈ పాత్రను పరిచయం చేశాడు. పులిలా పోరాటానికి ఎన్టీఆర్ టీజర్ లో దూసుకెళ్తున్నాడు.
RRR
Jr NTR
Ramcharan
Rajamouli

More Telugu News