Oxford: బ్రెజిల్‌లో కొవిడ్ టీకా పరీక్షల్లో అపశ్రుతి.. టీకా తీసుకున్న వలంటీర్ మృతి

Volunteer in Oxford coronavirus vaccine trial dies
  • ఆక్స్‌ఫర్డ్‌తో కలిసి టీకాను అభివృద్ధి చేసిన ఆస్ట్రాజెనెకా
  • వలంటీర్ మృతి విషయాన్ని నిర్ధారించిన బ్రెజిల్
  • టీకాపై అనుమానాలు అక్కర్లేదన్న ఆక్స్‌ఫర్డ్
బ్రెజిల్‌లో జరుగుతున్న కొవిడ్ టీకా ప్రయోగ పరీక్షల్లో విషాదం చోటుచేసుకుంది. వ్యాక్సిన్ తీసుకున్న ఓ వలంటీర్ మృతి చెందాడు. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంతో కలిసి ఆస్ట్రాజెనెకా  కరోనా టీకాను అభివృద్ధి చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఈ టీకాను పరీక్షిస్తున్నారు. మొదటి, రెండోదశ ప్రయోగాల్లో భాగంగా ఇటీవల బ్రిటన్‌లో ఈ టీకాను తీసుకున్న ఓ వ్యక్తి అనారోగ్యానికి గురి కావడంతో పరీక్షలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇటీవల మళ్లీ పరీక్షలను ప్రారంభించారు.

మూడో దశలో ఈ టీకాను వేయించుకున్న ఓ వలంటీర్ మృతి చెందినట్టు బ్రెజిల్ ఆరోగ్య విభాగం నిన్న వెల్లడించింది. అయితే, అతడు వ్యాక్సిన్ కారణంగా మరణించాడా? లేక, మరే కారణమైనా ఉందా? అన్న విషయాన్ని వెల్లడించని అధికారులు, పరీక్షలు మాత్రం కొనసాగుతాయన్నారు. కాగా, వ్యాక్సిన్ భద్రతపై ఎటువంటి అనుమానాలు అవసరం లేదని ఆక్స్‌ఫర్డ్ స్పష్టం చేసింది.
Oxford
AstraZeneca
vaccine
volunteer
COVID19

More Telugu News