సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

22-10-2020 Thu 07:31
  • ఇటలీకి బయలుదేరుతున్న కీర్తి సురేశ్ 
  • రామ్-లక్ష్మణ్ లకు మరో భారీ ఆఫర్
  • హిందీలో తెలుగు దర్శకుడికి ఇంకో ఛాన్స్    
Keerti Suresh leaves for Italy

*  కథానాయిక కీర్తి సురేశ్ ఈ నెల 25న ఇటలీకి వెళుతోంది. అయితే, ఇదేదో హాలిడే ట్రిప్ కాదు, ప్రస్తుతం తాను నటిస్తున్న 'రంగ్ దే' సినిమా షూటింగ్ కోసం వెళుతోంది. నితిన్, కీర్తి జంటపై ఇటలీలో రెండు పాటలను చిత్రీకరిస్తారు. అందుకే, 25న  యూనిట్ తో కలసి ఈ చిన్నది ఇటలీ వెళుతోంది.
*  'ఆచార్య' తర్వాత చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని మెహర్ రమేశ్ దర్శకత్వంలో చేయనున్నారు. తమిళంలో వచ్చిన 'వేదాళం' చిత్రానికి రీమేక్ గా తెరకెక్కే ఈ చిత్రానికి యాక్షన్ కొరియోగ్రాఫర్లుగా రామ్, లక్ష్మణ్ పనిచేస్తారని తెలుస్తోంది.
*  ప్రస్తుతం 'భాగమతి' చిత్రాన్ని 'దుర్గావతి' పేరిట హిందీలో భూమి ఫడ్నేకర్ తో రీమేక్ చేస్తున్న తెలుగు దర్శకుడు అశోక్.. తాజాగా మరో హిందీ చిత్రానికి ఓకే చెప్పాడు. నస్రత్ బరూచా, నోరా ఫతేహి ప్రధాన పాత్రలు పోషించే ఈ సినిమా డైలాగులు లేని మూకీ చిత్రంగా తెరకెక్కుతుంది.