Raghu Rama Krishna Raju: భవిష్యత్తులో అందరం ఈ పాట పాడుకోవాలేమో!: రఘురామకృష్ణరాజు

Raghurama Krishnaraju Rachabanda comments
  • ఓ మతాన్నే ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్న రఘురామ
  • దీన్ని ఖండించాలని పిలుపు
  • రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించొద్దంటూ సీఎంకు హితవు
ఏ ప్రభుత్వమైనా కేవలం ఒక మతాన్ని ప్రోత్సహించడం అనేది రాజ్యాంగ విరుద్ధం అవుతుందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. రాజ్యాంగ విరుద్ధమైన పనులు చేసి మీరు ఇబ్బంది పడొద్దని, మిమ్మల్ని ఎంతో అభిమానించే ప్రజలను ఇబ్బందుల్లో పడేసే పరిస్థితి తెచ్చుకోవద్దని సీఎం జగన్ కు హితవు పలికారు. ఈ తరహా ట్రెండ్ ను పునాది దశలోనే అరికట్టకపోతే హిందువులకు కష్టాలు తప్పవని పేర్కొన్నారు.

"మనం గుళ్లలో ఉదయాన్నే ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు ఆలపించిన సుప్రభాతం వింటుంటాం. "కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతేః, ఉత్తిష్ఠ నరశార్దూలా కర్తవ్యం దైవమాహ్నికం" అని వింటుంటాం. ఓ యాగ పరిరక్షణ కోసం శ్రీరాముల వారిని విశ్వామిత్రుల వారు తీసుకెళుతున్న సందర్భంగా పలికిన శ్లోకం ఇది. కానీ ఇప్పుడున్న ట్రెండ్ ను అరికట్టకపోతే... "ఏసయ్యా, మరియ తనయా పూర్వా సంధ్యా ప్రవర్తతేః" అని మనం పాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.

అని మతాలను గౌరవించాల్సిందే... అందులో తప్పేంలేదు. కానీ,  ఇప్పుడు మన డబ్బులు పాస్టర్లకు ఇస్తున్నారు, మన డబ్బులతో చర్చిలు నిర్మిస్తున్నారు. ఒక మతాన్నే ప్రభుత్వ సొమ్ముతో ప్రోత్సహిస్తుండడం బాధాకరం. గట్టిగా అడిగితే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం, మాట తప్పం, మడమ తిప్పం అంటున్నారు. రాజ్యాంగంలో పరమత సహనం ఉండాలని చెప్పారు. అయితే ఒక మతాన్నే ప్రోత్సహించడం సబబు కాదు. దీన్ని అందరూ ఖండించాలి" అని పేర్కొన్నారు.
Raghu Rama Krishna Raju
Rachabanda
Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News