సంక్రాంతి బరిలో రానా 'అరణ్య'

21-10-2020 Wed 13:41
  • పర్యావరణ అంశం ఆధారంగా చిత్రం
  • అనేక భాషల్లో విడుదల
  • నిరీక్షణ ముగిసిందన్నా రానా 
Rana movie Aranya will be released in Sankranti season

టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి నటించిన బహుభాషా చిత్రం అరణ్య వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది. నిరీక్షణ ముగిసింది... 2021 సంక్రాంతికి అరణ్య చిత్రం రిలీజ్ అవుతోందని రానా స్వయంగా వెల్లడించాడు. హిందీలో హాథీ మేరీ సాథీగా తెరకెక్కిన ఈ చిత్రం దక్షిణాది భాషల్లోనూ వస్తోంది. ఈ చిత్రానికి ప్రభు సాల్మన్ దర్శకత్వం వహించాడు. ఇందులో రానా, విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియ పిల్గావోంకర్ ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రం పర్యావరణ ఇతివృత్తంతో రూపొందినట్టు తెలుస్తోంది.

ఇందులో రానా పాత్రకు సంబంధించిన లుక్ చాలా డిఫరెంట్ గా ఉండడంతో చిత్రంపై మొదటి నుంచి అభిమానుల్లో ఆసక్తి కలుగుతోంది. మొత్తానికి వచ్చే సంక్రాంతి బరిలో రానా ఓ సందేశాత్మక చిత్రంతో రానున్నాడు. కాగా, సంక్రాంతికి పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్', నితిన్ 'రంగ్ దే' బెల్లంకొండ శ్రీనివాస్ 'అల్లుడు అదుర్స్' వంటి చిత్రాలు విడుదల కానున్నట్టు తెలుస్తోంది.