జాతీయ స్థాయిలో ట్రెండింగ్ లో ఉన్న బాలకృష్ణ 'నర్తనశాల'

21-10-2020 Wed 11:49
  • ఈ నెల 24న విడుదల కానున్న 'నర్తనశాల'
  • నిన్న ఫస్ట్ లుక్ విడుదల
  • ఆరో స్థానంలో ట్రెండ్ అవుతున్న వైనం
Balakrishnas Narthanasala is in trending on social media

కొన్నేళ్ల క్రితం తన స్వీయ దర్శకత్వంలో బాలకృష్ణ తెరకెక్కించే ప్రయత్నం చేసిన చిత్రం 'నర్తనశాల'. ఈ దసరా సందర్భంగా చిత్రీకరణ జరుపుకున్న కొన్ని సన్నివేశాలు  అభిమానుల ముందుకు వస్తున్నాయి. కేవలం 17 నిమిషాల నిడివి మాత్రమే ఉన్న ఈ చిత్ర సన్నివేశాలను ఈనెల 24న విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను నిన్న విడుదల చేశారు. ప్రస్తుతం ఇది జాతీయ స్థాయిలో ట్రెండింగ్ లో ఉంది. ఆరో స్థానంలో ట్రెండ్ అవుతోంది.

ఇందులో అర్జునుడి పాత్రలో బాలకృష్ణ, ద్రౌపదిగా సౌందర్య, ధర్మరాజుగా శరత్ బాబు, భీముడిగా శ్రీహరి నటించారు. సినిమాకు సంబంధించి కొంత షూటింగ్ జరిగిన తర్వాత హెలికాప్టర్ ప్రమాదంలో సౌందర్య చనిపోయారు. ఆ తర్వాత ఈ చిత్రాన్ని బాలయ్య కొనసాగించలేదు. అప్పుడు షూటింగ్ జరిగిన 17 నిమిషాల నిడివి గల సన్నివేశాలను ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు బాలయ్య తీసుకొస్తున్నారు.