Indian Railways: ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా మారుతున్న 362 రైళ్లు.. సామాన్యులపై మరింత భారం

  • దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో అత్యధికంగా 47 రైళ్లు
  • వేగం పెరుగుతుందంటున్న రైల్వే
  • అసలు ఉద్దేశం వేరే ఉందంటూ విమర్శలు
Indian railways upgrade passenger rails to express trains

దేశవ్యాప్తంగా 362 ప్యాసింజర్, డెము, మెము రైళ్లను ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చే ప్రతిపాదనకు రైల్వేబోర్డు నిన్న ఆమోదముద్ర వేసింది. ఫలితంగా సామాన్యులకు రైల్వే ప్రయాణం భారంగా మారనుంది. ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా మారున్న ప్యాసింజర్ రైళ్లలో అత్యధికంగా 47 రైళ్లు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే ఉండగా, వాటిలో 43 రైళ్లు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య తిరిగేవి కావడం గమనార్హం. వీటిలో కాకతీయ ఫాస్ట్ ప్యాసింజర్, సికింద్రాబాద్-రేపల్లె రైళ్లు కూడా ఉన్నాయి.

దక్షిణ మధ్య రైల్వే తర్వాత నార్త్ వెస్ట్రన్ జోన్‌లో 43, సదర్న్, సెంట్రల్ రైల్వే జోన్ల పరిధిలో 36 చొప్పున ప్యాసింజర్ రైళ్లు ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా మారబోతున్నాయి. ప్యాసింజర్ రైళ్లను ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చడం వల్ల వేగం పెరుగుతుందని రైల్వే వర్గాలు చెబుతున్నప్పటికీ అసలు కారణం వేరే ఉందని చెబుతున్నారు. టికెట్ల రూపంలో ఆదాయం పెంచుకోవడంతోపాటు నిర్వహణ ఖర్చులు తగ్గించుకునే వ్యూహం ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

More Telugu News