Donald Trump: ఏ మాత్రమూ తగ్గని దగ్గు... అరుదైన అవకాశాన్ని వదులుకున్న మెలానియా ట్రంప్!

Melania cancells Rare Opputunity
  • నేడు భర్తతో కలిసి ప్రచారంలో ఉండాల్సిన మెలానియా
  • విపరీతంగా దగ్గుతూ ఉండటంతో పర్యటన రద్దు
  • వెల్లడించిన మెలానియా అధికార ప్రతినిధి
తన భర్త, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో కలిసి ఎన్నికల ప్రచారానికి వెళ్లాల్సిన అరుదైన అవకాశాన్ని మెలానియా వదులుకున్నారు. ఇటీవల కరోనా వైరస్ బారిన పడిన ఆమె, కోలుకుంటున్నప్పటికీ, విపరీతంగా దగ్గుతూ ఉండటంతో ఆమె పెన్సిల్వేనియాలో జరగనున్న ర్యాలీకి వెళ్లడం లేదని ఆమె తరఫు ప్రతినిధి ఒకరు తెలిపారు. నేడు ఆమె పెన్సిల్వేనియాకు వెళ్లి ఉంటే, దాదాపు సంవత్సరం తరువాత భర్తతో కలిసి ఓ ర్యాలీలో పాల్గొన్నట్లయ్యేది.

"రోజురోజుకూ మెలానియా ట్రంప్ ఆరోగ్యం చక్కబడుతోంది. అయితే, ఇంతవరకూ దగ్గు మాత్రం తగ్గలేదు. ముందుజాగ్రత్త చర్యగా ఆమె తన ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు" అని స్టెఫానీ గ్రీషామ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల ఆరంభంలో ట్రంప్, మెలానియాలతో పాటు వారి కుమారుడు బారోన్ కు కూడా కరోనా సోకిన సంగతి తెలిసిందే.
Donald Trump
Melania Trump
Campaign

More Telugu News