వరద బాధితులకు ప్రభాస్ సాయం కోటి రూపాయలు!

20-10-2020 Tue 20:49
  • ఇప్పటికే పలువురు విరాళాలు  
  • రూ. 10 లక్షలు ప్రకటించిన రవితేజ
  • ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్
Prabhas and Raviteja announces contributions to TS CM Relief Fund

భారీ వర్షాల కారణంగా హైదరాబాదులోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. పలువురు ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వీరందరినీ పునరావాస కేంద్రాలకు తరలించారు. మరోవైపు వరద బాధితులను ఆదుకునేందుకు సినీ, వ్యాపార ప్రముఖులు ముందుకొస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు సీఎం సహాయ నిధికి భారీ ఎత్తున విరాళాలు ఇచ్చారు.

తాజాగా ప్రభాస్, రవితేజ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళం ప్రకటించారు. ప్రభాస్ రూ. 1 కోటి విరాళం ఇస్తున్నట్టు చెప్పారు. రవితేజ తన వంతుగా రూ. 10 లక్షలను ప్రకటించారు. మరోవైపు వరద బాధితులకు అండగా నిలిచిన సినీ స్టార్లకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.