వరద బాధితులకు రూ. 5 కోట్ల విరాళం ప్రకటించిన మైహోం గ్రూప్

20-10-2020 Tue 17:24
  • వరద బాధితులను ఆదుకోవాలంటూ సీఎం పిలుపు
  • కేసీఆర్ పిలుపుకు వస్తున్న భారీ స్పందన
  • విరాళాలను ప్రకటిస్తున్న ప్రముఖులు, సంస్థలు
MyHome Group contributes Rs 5 Cr to CMRF

భారీ వర్షాల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి ముందుకు రావాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపుకు భారీ స్పందన వస్తోంది. ఇప్పటికే పలువురు అగ్ర సినీ నటులు సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలను ప్రకటించారు. తాజాగా ప్రముఖ రియలెస్టేట్ సంస్థ మైహోమ్ గ్రూప్ రూ. 5 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా మైహోమ్ గ్రూప్ ఛైర్మన్ రామేశ్వరరావు మాట్లాడుతూ, వరద బాధితులకు సాయం చేయడం తమ బాధ్యత అని చెప్పారు. మరోవైపు సీఎం సహాయ నిధికి మేఘా ఇంజనీరింగ్ సంస్థ కూడా రూ. 10 కోట్ల విరాళాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.