తెలంగాణలో అన్ని పరీక్షలు వాయిదా వేశాం: సబితా ఇంద్రారెడ్డి
- హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో భారీ వర్షాలు
- ఇప్పటికే వాయిదా పడిన పలు పరీక్షలు
- దసరా వరకు అన్ని పరీక్షలు వాయిదా వేసిన రాష్ట్ర విద్యాశాఖ
ఇప్పటికే ఓయూ, జేఎన్టీయూ-హెచ్, అంబేద్కర్ వర్సిటీ, కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో అన్ని పరీక్షలు నిలిచిపోయాయి. బీఈడీ పరీక్షలు, డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు, ఎంబీఏ పరీక్షలు కొన్నిరోజుల కిందట వాయిదా పడ్డాయి. వర్షాలు తగ్గుముఖం పట్టకపోవడంతో అన్ని ప్రవేశ పరీక్షలతో పాటు యూజీ, పీజీ, ఇంజినీరింగ్ పరీక్షలను కూడా దసరా వరకు వాయిదా వేస్తున్నామని మంత్రి వివరించారు. త్వరలోనే కొత్త తేదీలు ప్రకటిస్తామని తెలిపారు.