Jagan: శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్

 CM Jagan will offerings to Kanakadurgamma
  • కొనసాగుతున్న దసరా ఉత్సవాలు
  • రేపు మూలానక్షత్రం
  • విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకోనున్న సీఎం జగన్
దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడ కనకదుర్గ అమ్మవారికి సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈ మేరకు దుర్గ గుడి వర్గాలు సీఎం జగన్ కు స్వాగతం పలికేందుకు సన్నద్ధమవుతున్నాయి. సీఎం జగన్ కు ఇటీవల ఆలయ వర్గాలు ఆహ్వాన పత్రిక అందజేశాయి.

ఈ క్రమంలో, రేపు మూలానక్షత్రం సందర్భంగా సీఎం జగన్ ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకుంటారని, పట్టువస్త్రాలు సమర్పిస్తారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడించారు.

మంత్రి వెల్లంపల్లి ఇవాళ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సూచించారు. అదే సమయంలో కొవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించేలా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. సీఎం జగన్ ఇటీవలే తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగానూ పట్టువస్త్రాలు సమర్పించడం తెలిసిందే. తిరునామాలతో సంప్రదాయ వస్త్రధారణలో సీఎం జగన్ తిరుమల వేంకటేశ్వరుడి దర్శనం చేసుకున్నారు.
Jagan
Kanakadurga
Vijayawada
Offering
Dusshera
Navaratri

More Telugu News