సెట్స్ మీదకు వెళ్లిన నిఖిల్ కొత్త చిత్రం '18 పేజెస్'

20-10-2020 Tue 15:42
  • నిఖిల్, అనుపమ జంటగా '18 పేజెస్'
  • మార్చిలో పూజా కార్యక్రమాలు జరుపుకున్న చిత్రం
  • నేటి నుంచి రెగ్యులర్ షూట్
Nikhil new movie shoot begins

కరోనా ప్రభావంతో గత కొన్నినెలలుగా నిలిచిపోయిన షూటింగులు మళ్లీ ఊపందుకుంటున్నాయి. తాజాగా యువ హీరో నిఖిల్ నటిస్తున్న కొత్త చిత్రం '18 పేజెస్' చిత్రీకరణ ఇవాళ ప్రారంభమైంది. ఈ చిత్రంలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది. సుకుమార్ ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందిస్తుండడం విశేషం. సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్యప్రతాప్ '18 పేజెస్' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

వాస్తవానికి ఈ చిత్రం మార్చిలోనే పూజా కార్యక్రమాలు జరుపుకుంది. కరోనా వ్యాప్తి కారణంగా లాక్ డౌన్ ప్రకటించడంతో చిత్రీకరణ ముందుకు కదల్లేదు. లాక్ డౌన్ ఆంక్షల సడలింపుల నేపథ్యంలో రెగ్యులర్ షూటింగ్ కోసం ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లింది.