bharathiraja: తెలుగు హీరోలు పారితోషికాన్ని తగ్గించుకున్నారన్న భారతీ రాజా.. తమిళ నటులూ తగ్గించుకోవాలని పిలుపు

  • పారితోషికంలో 30 శాతం తగ్గించుకోవాలి
  • ఆరు నెలలుగా సినిమాలను విడుదల చేయలేకపోతున్నాం
  • నిర్మాతలు కష్టాలు పడుతున్నారు
bharathiraja suggesion to tamis heros

కరోనా వ్యాప్తి నేపథ్యంలో తలెత్తిన సంక్షోభం నేపథ్యంలో అన్ని వ్యాపారాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. సినిమా రంగంపై కూడా దెబ్బ పడింది. ఈ నేపథ్యంలో తమిళ సినీరంగాన్ని ఆదుకునేందుకు హీరోలు, హీరోయిన్లు, దర్శకులతో పాటు ఇతర సినీ రంగంలోని వారు తమ పారితోషికంలో 30 శాతం తగ్గించుకోవాలని సినీ నిర్మాతల సంఘం అధ్యక్షుడు, ప్రముఖ దర్శకుడు భారతీ రాజా ఓ ప్రకటనలో కోరారు.  టాలీవుడ్ లో హీరో, హీరోయిన్లు తమకు తాముగా 30 శాతం పారితోషికం తగ్గించుకుంటున్నట్లు ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఆరునెలలుగా సినిమాలను విడుదల చేయలేక నిర్మాతలు పడుతున్న కష్టాలను అర్థం చేసుకోవాలని కోరారు. నిర్మాణంలో వున్న సినిమాల షూటింగ్‌లు బంద్ కావడంతో తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నారని చెప్పారు. నిర్మాతలను వెంటనే ఆదుకోవాల్సిన బాధ్యత సినీరంగానికి చెందిన కళాకారులందరిపైనా ఉందని ఆయన తెలిపారు. 6 నెలలుగా షూటింగ్‌లు ఆగిపోయిన సినిమాల్లో నటిస్తున్న నటీనటులు, దర్శకులు ఒప్పందంలో పేర్కొన్న పారితోషికంలో కనీసం 30 శాతం తగ్గించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 

More Telugu News