కేసీఆర్ కోరగానే... హైదరాబాద్ కు చేరుకున్న స్పీడ్ బోట్లు!

20-10-2020 Tue 08:32
  • ఇంకా ముంపులోనే పలు హైదరాబాద్ కాలనీలు
  • మరింత వర్షం పడితే పెరగనున్న నీటిమట్టం
  • సహాయక చర్యల కోసం ఏపీ నుంచి మర పడవలు
Speed Boats Reached Hyderabad

హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడం, మరిన్ని వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో, నీటి మట్టం పెరిగితే, సహాయక చర్యలకు అంతరాయం కలుగకూడదన్న ఉద్దేశంతో స్పీడ్ బోట్లను పంపించాలని తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ ను కోరిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే స్పందించిన జగన్, తక్షణం స్పీడ్ బోట్లను పంపాలని అధికారులను ఆదేశించారు.

దీంతో నిన్న రాత్రే అందుబాటులో ఉన్న బోట్లను ప్రత్యేక వాహనాలపైకి ఎక్కించిన అధికారులు, వాటిని హైదరాబాద్ కు పంపించారు. ఈ ఉదయం అవి తెలంగాణకు చేరుకున్నాయి. వాటిని ముంపునకు గురైన మీర్ పేట, ఓల్డ్ సిటీలోని బస్తీల్లో ఉంచి, అవసరాలకు వినియోగిస్తామని అధికారులు వెల్లడించారు.