Jaggareddy: హరీశ్ రావు తన మంత్రి పదవిని, సిద్ధిపేట టికెట్ ను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు: జగ్గారెడ్డి

Congress leader Jaggareddy criticizes minister Harish Rao
  • దుబ్బాక ఉప ఎన్నికల్లో జగ్గారెడ్డి ప్రచారం
  • కాంగ్రెస్ అభ్యర్థినే గెలిపించాలని సూచన
  • టీఆర్ఎస్ ఓడితే హరీశ్ రావు మంత్రి పదవి పోతుందని వెల్లడి
దుబ్బాక శాసనసభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మంత్రి హరీశ్ రావుపై విమర్శనాస్త్రాలు సంధించారు. దుబ్బాక ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతే హరీశ్ రావు మంత్రి పదవి పోతుందని, ఎమ్మెల్యే సీటు కూడా ఉండదని అన్నారు. ప్రస్తుతం హరీశ్ రావు ప్రయత్నమంతా తన మంత్రిపదవి, సిద్ధిపేట టికెట్ కాపాడుకునేందుకేనని వ్యాఖ్యానించారు.

దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆయన వేములఘాట్ గ్రామంలో ప్రసంగించారు. వేముల ఘాట్ గ్రామంలో కాంగ్రెస్ కు అత్యధిక మెజారిటీ అందించాలని కోరారు. ప్రజల సమస్యల గురించి నిలదీయాలంటే కాంగ్రెస్ అభ్యర్థినే గెలిపించాలని అన్నారు. మల్లన్న సాగర్ ముంపు ప్రాంతాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
Jaggareddy
Harish Rao
Dubbaka
By Polls
TRS
Congress

More Telugu News