Tulasi Reddy: బీసీల ఐక్యతను దెబ్బతీసే కుట్ర చేస్తున్నారు: తులసిరెడ్డి

Jagan trying to destroy the unity of BCs says Tulasi Reddy
  • విభజించు పాలించు సిద్ధాంతాన్ని జగన్ అనుసరిస్తున్నారు
  • బీసీ కార్పొరేషన్లు నేతి బీరకాయల వంటివి 
  • బీసీలకు అసలైన మిత్రుడు కాంగ్రెస్ పార్టీనే

విభజించు పాలించు అనే బ్రిటీష్ కుటిల నీతిని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అనుసరిస్తున్నారని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి మండిపడ్డారు. కులాల పేరుతో కార్పొరేషన్లను ఏర్పాటు చేసి, బీసీల మధ్య ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న బీసీ కార్పొరేషన్లు నేతి బీరకాయల వంటివని అన్నారు. నేతి బీరకాయలో నెయ్యి ఉండదని, బీసీ కార్పొరేషన్లలో నిధులు ఉండవని ఎద్దేవా చేశారు.

బీసీలకు అసలైన మిత్రుడు కాంగ్రెస్ పార్టీనేనని తులసిరెడ్డి అన్నారు. 50 ఏళ్ల క్రితమే బీసీలకు రిజర్వేషన్లను కల్పించిన ఘనత కాంగ్రెస్ దేనని చెప్పారు. 26 ఏళ్ల క్రితం స్థానిక సంస్థలలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించిందని తెలిపారు. 12 ఏళ్ల క్రితమే ఫీజు రీయింబర్స్ మెంట్ కల్పించిందని చెప్పారు.

  • Loading...

More Telugu News