Dimitri Stuzuk: కరోనా లేదని ప్రచారం చేసి, మహమ్మారికే బలై ప్రాణాలు కోల్పోయిన ఫిట్ నెస్ స్టార్!

Fitness Star Who Says No Corona died with Pandamic
  • శారీరకంగా ఫిట్ గా ఉంటే చాలన్న దిమిత్రి స్టుజుక్
  • కరోనా సోకి కోలుకున్న తరువాత పరిస్థితి విషమం
  • కన్నుమూశారని స్పష్టం చేసిన మాజీ భార్య
దిమిత్రి స్టుజుక్... 33 సంవత్సరాల ఫిట్ నెస్ ఇన్ ఫ్లూయన్సర్. సామాజిక మాధ్యమాల్లో దాదాపు 11 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ను కలిగివున్న సెలబ్రిటీ. తన వీడియోలతో ఎంతో మందికి ప్రేరణగా నిలిచాడు కూడా. అటువంటి దిమిత్రి, కరోనా సోకి కన్నుమూసి, తన అభిమానులకు తీరని శోకాన్ని మిగిల్చారు. స్టుజుక్ మరణ వార్తను ఆయన మాజీ భార్య సోఫియా తన ఇన్ స్టాగ్రామ్ లో స్పష్టం చేయగా, ఎంతో ఫిట్ నెస్ తో ఉండే స్టుజుక్, ఈ మహమ్మారి సోకి, ప్రాణాలను కోల్పోయాడని చాలా మంది ఇప్పటికీ నమ్మలేకున్నారు.

వాస్తవానికి శారీరకంగా పూర్తి ఫిట్ గా ఉన్న వారు కరోనా బారిన పడబోరని, ఒకవేళ వైరస్ సోకినా, చాలా సులువుగా కోలుకోవచ్చని దిమిత్రి తొలుత ప్రచారం చేశారు. అయితే, ఇటీవల టర్కీలో పర్యటించిన ఆయన, తీవ్రమైన కడుపునొప్పితో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడి, తన దేశానికి వచ్చిన తరువాత, పరీక్షలు చేయించుకోగా, కరోనా సోకిందని వైద్యులు నిర్దారించారు. ఆపై ఆసుపత్రిలో చికిత్స పొంది, డిశ్చార్జ్ కూడా అయ్యారు.

ఆ తరువాత ఉన్నట్టుండి పరిస్థితి విషమించింది. మరోసారి ఆసుపత్రిలో చేరిన తరువాత, సోషల్ మీడియాలో దిమిత్రి కొన్ని పోస్టులు పెట్టాడు. తనకు కరోనా వచ్చేంత వరకూ ఇటువంటి ఓ వ్యాధి ఉందని తాను నమ్మలేదన్నాడు. ఈ వైరస్ చాలా బలమైందని, ఇప్పట్లో ప్రపంచాన్ని విడిచి పోదని, అంతం కాబోదని వైరస్ తో జాగ్రత్తగా ఉండాలని అన్నాడు. అవే అతని చివరి మాటలు అయ్యాయి. తమ ఫేవరెట్ ఫిట్ నెస్ ట్రయినర్ కన్నుమూశాడని తెలిసి పలువురు అభిమానులు, సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.
Dimitri Stuzuk
Fitness
Corona Virus
Died

More Telugu News