Hyderabad: భారీ వర్షాల ఎఫెక్ట్: కుంగిన పురానాపూల్ బ్రిడ్జి.. రాకపోకలు నిలిపివేత

puranapool bridge pillar damaged due to heavy floods
  • హైదరాబాద్‌లో తొలి వంతెనగా రికార్డు
  • వరద నీటి తాకిడితో ఉద్ధృతి పెరగడంతో పిల్లర్ కుంగుబాటు
  • మరమ్మతుల అనంతరం రాకపోకల పునరుద్ధరణ
హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాల ప్రభావం 400 ఏళ్ల పురాతన పురానాపూల్ బ్రిడ్జిపై పడింది. గత కొన్ని రోజులుగా నగరంలో కురుస్తున్న వర్షాలకు వరద ఉద్ధృతి పెరగడంతో బ్రిడ్జి ఒత్తిడికి గురైంది. ఫలితంగా గత రాత్రి ఓ పిల్లర్ కుంగిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే బ్రిడ్జి వద్దకు చేరుకున్న పోలీసులు ఇరు వైపుల నుంచి ట్రాఫిక్ నిలిపివేశారు. మరమ్మతుల అనంతరం రాకపోకలు పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు.

4 శతాబ్దాల కాలంలో పురానాపూల్ బ్రిడ్జి దెబ్బతినడం ఇది రెండోసారి మాత్రమే. హైదరాబాద్‌లో నిర్మించిన తొలి వంతెనగా రికార్డులకెక్కిన ఈ బ్రిడ్జి 1820లో వచ్చిన మూసి వరదలకు స్వల్పంగా దెబ్బతింది. దీంతో అప్పటి నవాబు సికిందర్ షా మరమ్మతులు చేయించాడు. 1908లో మరోమారు దీనికి మరమ్మతులు చేశారు. గోల్కొండ కోట నుంచి కార్వాన్ వెళ్లేందుకు వీలుగా 1578లో ఇబ్రహీం కులీ కుతుబ్‌షా దీనిని నిర్మించాడు.
Hyderabad
puranapool bridge
heavy rains
floods

More Telugu News