వచ్చేది శీతాకాలం... కరోనా విజృంభించే అవకాశాలున్నాయంటున్న నీతి ఆయోగ్ సభ్యుడు
- కరోనా సెకండ్ వేవ్ పై వీకే పాల్ వ్యాఖ్యలు
- యూరప్ లో ఇలాగే జరుగుతోందని వెల్లడి
- మరింత పరిశోధనలు చేస్తున్నట్టు వివరణ
యూరప్ లో కరోనా మహమ్మారి తిరగబెడుతోందని, నెమ్మదించినట్టే నెమ్మదించి మళ్లీ విరుచుకుపడుతోందని, భారత్ లో రాబోయేది చలికాలం కావడంతో భారత్ లో ఈ వైరస్ తీవ్రమయ్యే అవకాశాలను కొట్టిపారేయలేమని అన్నారు. దీనిపై విస్తృతస్థాయిలో పరిశోధనలు చేస్తున్నట్టు పాల్ వెల్లడించారు. ప్రస్తుతం భారత్ మెరుగైన స్థితిలోనే ఉందని, అయితే అనేక అవరోధాలను అధిగమించాల్సి ఉందని అన్నారు. కరోనా వ్యాక్సిన్ మార్కెట్లోకి వస్తే భద్రపరిచేందుకు కావాల్సినన్ని కోల్డ్ స్టోరేజిలు ఉన్నాయని వెల్లడించారు.