బిగ్ బాస్-4: ఈ వారం ఇద్దర్ని బ్యాగ్ సర్దుకోమన్న నాగ్.. ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

18-10-2020 Sun 18:35
Bigg Boss host Nagarjuna announces double elimination this week
  • ఇవాళ ఎలిమినేషన్ డే
  • తాజా ప్రోమో విడుదల
  • నాగ్ ప్రకటనతో బిగ్ బాస్ ఇంటి సభ్యుల్లో  దిగ్భ్రాంతి

బిగ్ బాస్-4 రియాలిటీ షో ఆసక్తికరంగా సాగుతోంది. కంటెస్టెంట్ల తగాదాలు, గిల్లికజ్జాలు, టాస్కులు.... ఇలా సగటు టీవీ ప్రేక్షకుడికి కావాల్సిన వినోదం బాగానే లభిస్తోంది. అయితే ఈ వారం ఎవరు ఎలిమినేషన్ అవుతారన్న దానిపై హోస్ట్ నాగార్జున సస్పెన్స్ క్రియేట్ చేశాడు. కుమార్ సాయి పంపన ఎలిమినేట్ అవుతాడని ఈ ఉదయం నుంచి ప్రచారం జరుగుతుండగా, ఈ సాయంత్రం విడుదల చేసిన ప్రోమోలో నాగ్ ట్విస్ట్ ఇచ్చాడు. ఈసారి ఇద్దర్ని బ్యాగ్ సర్దుకోమని చెప్పి అందరినీ అయోమయానికి గురిచేశాడు.

"రెగ్యులర్ ఎలిమినేషన్స్ లాంటి రోజు కాదు ఇది... ఇది డిఫరెంట్ ఎలిమినేషన్. మీరిద్దరూ బ్యాగులు సర్దుకోండి" అంటూ తనదైన శైలిలో సీరియస్ గా చెప్పాడు. అటు బిగ్ బాస్ ఇంటి సభ్యులు కూడా నాగ్ అనౌన్స్ మెంట్ తో దిగ్భ్రాంతికి గురయ్యారు. దాంతో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరన్నదానిపై ఆసక్తి పతాకస్థాయికి చేరుతోంది.