హైదరాబాద్ వరద బాధితులకు భారీ విరాళం ప్రకటించిన బాలకృష్ణ... పాతబస్తీ వాసుల కోసం బిర్యానీ

18-10-2020 Sun 18:22
Balakrishna donates huge amount to Hyderabad flood affected people
  • హైదరాబాదులో వరదలు
  • చలించిపోయిన బాలయ్య
  • రూ.1.50 కోట్లు విరాళం

హైదరాబాదులో కనీవినీ ఎరుగని రీతిలో వరద బీభత్సం కొనసాగుతున్న నేపథ్యంలో నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భారీ విరాళం ప్రకటించారు. భారీ సంఖ్యలో ప్రజలు వరదల కారణంగా ప్రాణాలు కోల్పోగా, వేల మంది నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ హైదరాబాద్ వరద బాధితుల కోసం రూ.1.50 కోట్ల విరాళం ప్రకటించారు. అంతేకాదు, బసవతారకరామ సేవా సమితి నేతృత్వంలో పాతబస్తీ వాసులకు ఆహారం అందించారు. సుమారు 1000 కుటుంబాలకు బిర్యానీ పంపించారు. ఈ సాయంత్రం ఆహార వితరణ జరగనుంది.

కాగా, హైదరాబాదులోని పలు ప్రాంతాల్లో ఇప్పటికీ వరదలు కొనసాగుతున్నాయి. నిన్న కురిసిన కుంభవృష్టితో నగరం మరోమారు జలమయం అయింది. అత్యధిక ప్రాంతాలు నీటమునిగాయి. ఎక్కడ చూసినా దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి.