చర్మంపై 9 గంటల పాటు సజీవంగా కరోనా.. పరిశోధనలో వెల్లడి

18-10-2020 Sun 13:26
corona lasts 9 hours On body
  • జపాన్ పరిశోధనలో వెల్లడి
  • లోహం, గ్లాస్, ప్లాస్టిక్ మీద 9 రోజుల వరకూ వైరస్
  • తక్కువ ఉష్ణోగ్రతల్లో 28 రోజుల వరకు

కరోనాపై చేస్తోన్న పరిశోధనల్లో తాజాగా మరికొన్ని విషయాలు తెలిశాయి. శరీరంలోకి కరోనా వైరస్ ఎన్నో విధాలుగా ప్రవేశించడానికి ఆస్కారం ఉందని అందరూ భావిస్తున్నారు. కరోనా రోగి ముట్టుకున్న ఏదైనా వస్తువుని ఇతరులు ముట్టుకుని అనంతరం తమ చేతిని ముఖం లేక మాస్కుపై పెడితే కూడా కరోనా వస్తుందని భావిస్తున్నాం. అయితే, కరోనా వైరస్ ఉన్న వస్తువును తాకి అదే చేతుల్తో తమ ముఖాన్ని తాకితే  వైరస్ వ్యాపించడానికి ప్రధాన కారణం కాదని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. అయినప్పటికీ చేతులను శుభ్రంగా కడుక్కోవడం, ఉపరితలాలను శుభ్రం చేయడం ముఖ్యమని ఆరోగ్య సంస్థలు చెబుతున్నాయి.

మరోవైపు, కరోనా కచ్చితంగా ఎంతకాలం పాటు మనిషి శరీరం బయట ఉంటుందనే విషయంపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు. దీనిపై జపాన్ పరిశోధకులు పలు విషయాలు గుర్తించారు. శానిటైజ్ చేయనంతవరకు కరోనా వంటి వైరస్ లు అవి లోహం, గ్లాస్, ప్లాస్టిక్ మీద 9 రోజుల వరకూ బతకగలవని జపాన్ పరిశోధకులు చెప్పారు. తక్కువ ఉష్ణోగ్రతల్లో 28 రోజుల వరకూ ఉంటాయిని గుర్తించారు. మానవ శరీరంపై దాదాపు తొమ్మిది గంటల వరకు వైరస్ బతికి ఉంటుందని చెప్పారు.