'పప్పుసేన' అంటూ శివసేనపై మరోసారి విరుచుకుపడ్డ కంగనా రనౌత్

18-10-2020 Sun 12:12
Kangana called Shiv Sena as Pappu Sena
  • నాపై మరో ఎఫ్ఐఆర్ నమోదైంది
  • పప్పూసేనకు నాపై అభిమానం ఎక్కువైంది
  • నన్ను వదల్లేకపోతున్నారు

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ పై ముంబై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ దాఖలైన పిటిషన్ నేపథ్యంలో కోర్టు ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదైన తర్వాత కంగన తొలిసారి స్పందించారు.

నవరాత్రుల సందర్భంగా ఎవరెవరు ఉపవాసం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. దుర్గా పూజ తర్వాత తాను ఉపవాసం చేస్తున్నానని చెప్పారు. తనపై మరో ఎఫ్ఐఆర్ నమోదైందని, పప్పూసేనకు తనపై అభిమానం ఎక్కువైనట్టుందని, అందుకే తనను వదల్లేకపోతున్నారని ఎద్దేవా చేసింది. తనను మిస్ కావాల్సిన అవసరం లేదని... త్వరలోనే ముంబైకి వచ్చేస్తానని తెలిపింది. ప్రస్తుతం 'తలైవి' సినిమా షూటింగ్ లో కంగన బిజీగా ఉంది.